bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
/
2 Kings 14
2 Kings 14
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
← Chapter 13
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 15 →
1
ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.౹
2
అతడు ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువదితొమ్మిది సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెహోయద్దాను.౹
3
ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక పోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను.౹
4
అయితే అతడు ఉన్నతస్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నతస్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.౹
5
రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను.౹
6
అయితే— కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణశిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.౹
7
మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.
8
అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి–మనము ఒకరి నొకరము దర్శించునట్లు నన్ను కలియ రమ్మని వర్తమానముచేయగా
9
ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను–లెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటి–నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానో నులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.౹
10
నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతనుబట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతోకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను
11
అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా
12
యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమతమ గుడారములకు పారిపోయిరి.౹
13
మరియు ఇశ్రాయేలురాజైన యెహోయాషు అహజ్యాకుపుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మమువరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.౹
14
మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్తవస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.౹
15
యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలురాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹
16
అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.
17
యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.౹
18
అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడి యున్నది.౹
19
అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెనుగాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.౹
20
వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.౹
21
అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభి షేకము చేసిరి.౹
22
ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.
23
యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా యేలుబడిలో పదునయిదవ సంవత్సరమందు ఇశ్రాయేలురాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి నలువదియొక సంవత్సరములు ఏలెను.౹
24
ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹
25
గత్హేపరు ఊరివాడైన అమిత్త యికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రమువరకు ఇశ్రాయేలువారి సరిహద్దును మరల స్వాధీనము చేసికొనెను.౹
26
ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.౹
27
యెహోవా ఇశ్రాయేలువారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకా శము క్రిందనుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి యుండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను.౹
28
యరొబాము చేసిన యితరకార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు, అతడు చేసిన యుద్ధమునుగూర్చియు, దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రాయేలువారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹
29
యరొబాము తన పితరులైన ఇశ్రాయేలురాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.
← Chapter 13
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 15 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25