bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
/
Ezra 2
Ezra 2
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 3 →
1
బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి
2
యెరూషలేమునకును యూదాదేశమునకును తమతమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.౹
3
పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,౹
4
షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,౹
5
ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,౹
6
పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,౹
7
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,౹
8
జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు, జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,౹
9
[9-11] బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు, బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,౹
12
అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,౹
13
అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,౹
14
బిగ్వయి వంశస్థులు రెండువేల ఏబది ఆరుగురు;౹
15
ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,౹
16
అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు,౹
17
బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,౹
18
యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,౹
19
హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,౹
20
గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,౹
21
బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,౹
22
నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,౹
23
అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,౹
24
[24-25] అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,౹
26
రామా, గెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువదియొక్కరు,౹
27
మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,౹
28
బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,౹
29
[29-31] నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,౹
32
హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,౹
33
లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువదియయిదుగురు,౹
34
యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,౹
35
సెనాయా వంశస్థులు మూడువేల ఆరు వందల ముప్పదిమంది,౹
36
యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు
37
ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,౹
38
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువదియేడుగురు,౹
39
హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడు గురు,౹
40
లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,౹
41
గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,౹
42
ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,౹
43
నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,౹
44
కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు,౹
45
లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,౹
46
హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు,౹
47
గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,౹
48
రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,౹
49
ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,౹
50
అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,౹
51
బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,౹
52
బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,౹
53
బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు,౹
54
నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,౹
55
సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,౹
56
యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,౹
57
షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,౹
58
నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.౹
59
మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమపితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందునవారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.౹
60
వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.౹
61
మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొని వారి పేళ్లనుబట్టి బర్జిల్లయి అనిపిలువబడినవాని వంశస్థులు.౹
62
వీరు వంశావళి లెక్కలో తమతమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచ బడిరి.౹
63
మరియు పారసీకుల అధికారి–ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడువరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికాజ్ఞాపించెను.౹
64
సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.౹
65
వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడువేల మూడువందల ముప్పదియేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.౹
66
వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,౹
67
వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.౹
68
కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.౹
69
పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారువేల మూడువందల తులముల బంగారమును రెండులక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.౹
70
యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమతమ పట్టణములందు కాపురము చేసిరి.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 3 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10