bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
/
Leviticus 11
Leviticus 11
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 12 →
1
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
2
–మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి–భూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును;౹
3
జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని
4
నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹
5
పొట్టి కుందేలు నెమరువేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹
6
కుందేలు నెమరు వేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹
7
పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.౹
8
వాటి మాంసమును మీరు తినకూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.
9
జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.౹
10
సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలు సులు ఉండవో అవన్నియు మీకు హేయములు;౹
11
అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.౹
12
నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.
13
పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,౹
14
క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,౹
15
[15-17] ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ,౹
18
పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,౹
19
సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.
20
రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరములన్నియు మీకు హేయములు.౹
21
అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.౹
22
నేత మిడతగాని చిన్నమిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును.౹
23
నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.౹
24
వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹
25
వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹
26
రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరువేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.౹
27
నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;౹
28
వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును; అవి మీకు అపవిత్రమైనవి.
29
నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,౹
30
ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.౹
31
ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹
32
వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్రమగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమేగాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును.౹
33
వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.౹
34
తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.౹
35
వాటి కళేబరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.౹
36
అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావుగాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును.౹
37
వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనములమీద పడినను అవి అపవిత్రములు కావుగాని
38
ఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.
39
మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చినయెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹
40
దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.
41
నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.౹
42
నేలమీద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.౹
43
ప్రాకు జీవరాసులలో దేనినైననుతిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగ జేసికొనకూడదు.౹
44
నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.౹
45
నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
46
అపవిత్రమైనదానికిని పవిత్రమైనదానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు
47
జంతువులనుగూర్చియు, పక్షులనుగూర్చియు, జలచరములైన సమస్త జీవులనుగూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులనుగూర్చియు చేసిన విధి యిదే అని చెప్పుమనెను.
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 12 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27