bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
/
Mark 15
Mark 15
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
← Chapter 14
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 16 →
1
ఉదయముకాగానే ప్రధానయాజకులును పెద్ద లును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచనచేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి.
2
పిలాతు–యూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన–నీవన్నట్టే అని అతనితో చెప్పెను.
3
ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా
4
పిలాతు ఆయనను చూచి మరల–నీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
5
అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను.
6
ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.
7
అధికారుల నెదిరించి, కలహములో నరహత్య చేసినవారితోకూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
8
జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా
9
[9-10] ప్రధానయాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని–నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను.
11
అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.
12
అందుకు పిలాతు–ఆలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను.
13
వారు–వానిని సిలువవేయుమని మరల కేకలువేసిరి.
14
అందుకు పిలాతు–ఎందుకు? అతడే చెడుకార్యము చేసె నని వారి నడుగగా వారు–వానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
15
పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
16
అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమకూర్చుకొనినతరువాత
17
ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తలమీదపెట్టి,
18
–యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.
19
మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి.
20
వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి.
21
కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి.
22
అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము.
23
అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు.
24
వారాయనను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లువేసి, వాటిని పంచుకొనిరి.
25
ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.
26
మరియు–యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి.
27
[27-29] మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతోకూడ సిలువవేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు —ఆహా దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా,
30
సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి.
31
అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచు–వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.
32
ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి.
33
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
34
మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
35
దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని–అదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి.
36
ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చునేమో చూతమనెను.
37
అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.
38
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.
39
ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి–నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
40
వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.
41
ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్ర్తీలనేకులును వారిలో ఉండిరి.
42
ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతిదినమునకు పూర్వదినము
43
గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.
44
పిలాతు — ఆయన ఇంతలోనే చని పోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తనయొద్దకు పిలిపించి–ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.
45
శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.
46
అతడు నారబట్టకొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.
47
మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
← Chapter 14
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 16 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16