bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
/
Micah 7
Micah 7
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
1
వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్లగెల యొకటియు లేకపోయెను, నా ప్రాణమునకిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను.౹
2
భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును.౹
3
రెండు చేతులతోను కీడుచేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగునవారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.౹
4
వారిలో మంచివారు ముండ్లచెట్టువంటివారు, వారిలో యథార్థవంతులు ముండ్లకంచెకంటెను ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు.౹
5
స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.౹
6
కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.
7
అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.౹
8
నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.౹
9
నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.౹
10
నా శత్రువు దాని చూచును. —నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును.౹
11
నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును.౹
12
ఆ దినమందు అష్షూరుదేశమునుండియు, ఐగుప్తుదేశపు పట్టణములనుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసునదివరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆయా సముద్రములమధ్యదేశములనుండియు, ఆయా పర్వతములమధ్యదేశములనుండియు జనులు నీ యొద్దకు వత్తురు.౹
13
అయితే దేశనివాసులు చేసిన క్రియలనుబట్టి దేశము పాడగును.
14
నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపువారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు.౹
15
ఐగుప్తుదేశములోనుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును.౹
16
అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంత కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును.౹
17
సర్పములాగున వారు మన్ను నాకుదురు, భూమిమీద ప్రాకుపురుగులవలె తమ యిరవులలోనుండి వణకుచు ప్రాకి వత్తురు, మన దేవుడైన యెహోవాయొద్దకు భయపడుచు వత్తురు, నిన్నుబట్టి భయము నొందుదురు.౹
18
తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.౹
19
ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.౹
20
పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్ర హింతువు.
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
All chapters:
1
2
3
4
5
6
7