bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
/
Numbers 1
Numbers 1
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 2 →
1
వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవనెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను
2
–ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.౹
3
ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమతమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.౹
4
మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతోకూడ ఉండవలెను.౹
5
మీతోకూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా–రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;౹
6
షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు
7
యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను
8
ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు
9
జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
10
యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు
11
బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను
12
దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు
13
ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు
14
గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు
15
నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.౹
16
వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమతమపితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.౹
17
పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవనెల మొదటి తేదిని సర్వసమాజమును కూర్చెను.౹
18
ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమతమ వంశావళులనుబట్టి తమతమ వంశములను తమతమపితరుల కుటుంబములను తమతమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
19
యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.
20
ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి.
21
[21-22] షిమ్యోను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
23
షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
24
గాదు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
25
గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
26
యూదా పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
27
యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.
28
ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
29
ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగువందలమంది యైరి.
30
జెబూలూను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
31
జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది యైరి.
32
యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా
33
యోసేపు గోత్రములో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది యైరి.
34
మనష్షే పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
35
మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.
36
బెన్యామీను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
37
బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగువందలమంది యైరి.
38
దాను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
39
దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందలమంది యైరి.
40
ఆషేరు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
41
ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.
42
నఫ్తాలి పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
43
నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.
44
వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమతమపితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించినవారు.౹
45
అట్లు ఇశ్రాయేలీయులలో తమతమపితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు
46
లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.
47
అయితే లేవీయులు తమపితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.౹
48
ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను —నీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు.౹
49
ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.౹
50
నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవచేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు.౹
51
మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించినయెడలవాడు మరణశిక్ష నొందును.౹
52
ఇశ్రాయేలీయులు తమతమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.౹
53
ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.౹
54
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 2 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36