bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
/
1 Chronicles 21
1 Chronicles 21
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
← Chapter 20
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 22 →
1
సాతాను ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచి, వారి జనాభా లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.
2
కాబట్టి దావీదు యోవాబుతో, సైన్యాధిపతులతో, “మీరు వెళ్లి బెయేర్షేబ నుండి దాను వరకు ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కించండి. వారి సంఖ్య నాకు తెలిసేలా ఆ వివరాలు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
3
కాని యోవాబు రాజుతో, “యెహోవా తన సైన్యాన్ని వందరెట్లు పెంచు గాక! నా ప్రభువా, రాజా, వారంతా నా ప్రభువుకు సేవకులే కదా? నా ప్రభువు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? అతడు ఇశ్రాయేలు మీదికి దోషం ఎందుకు తేవాలి?” అని అన్నాడు.
4
అయితే రాజు యోవాబుపై తన మాట సాధించుకున్నాడు; కాబట్టి యోవాబు వెళ్లి, ఇశ్రాయేలు దేశమంతా తిరిగి యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
5
యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు అంతటిలో కత్తి తిప్పగలవారు పదకొండు లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో నాలుగు లక్షల డెబ్బైవేలమంది ఉన్నారు.
6
రాజాజ్ఞ యోవాబుకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి అతడు లేవీ బెన్యామీను వారిని లెక్కలలో చేర్చలేదు.
7
ఈ ఆజ్ఞ దేవుని దృష్టిలో కూడా చెడ్డగా ఉంది; కాబట్టి ఆయన ఇశ్రాయేలును శిక్షించారు.
8
అప్పుడు దావీదు దేవునితో, “నేను ఇది చేసి ఘోరపాపం చేశాను. మీ సేవకుని దోషాన్ని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను” అని ప్రార్థన చేశాడు.
9
యెహోవా, దావీదుకు దీర్ఘదర్శిగా ఉన్న గాదుతో ఇలా అన్నారు,
10
“వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీకు మూడు ఎంపికలు ఇస్తున్నాను. వాటిలో ఒకదాన్ని ఎంచుకో, దానిని నీమీదికి రప్పిస్తాను.’ ”
11
కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘వీటిలో ఒకదాన్ని ఎంచుకో:
12
మూడు సంవత్సరాల కరువు, మూడు నెలలు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే వారి ఎదుట నుండి పారిపోవడం, లేదా మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం అనగా తెగులు వ్యాపించడం ద్వారా యెహోవా దేవదూత ఇశ్రాయేలీయుల దేశమంతటిని నాశనం చేయడం.’ ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో నిర్ణయించుకో” అన్నాడు.
13
అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే నేను పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు.
14
కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు, డెబ్బైవేలమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.
15
దేవుడు యెరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపారు. అయితే ఆ దూత దానిని నాశనం చేస్తున్నప్పుడు, జరిగిన కీడును చూసి యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం దగ్గర నిలబడ్డాడు.
16
దావీదు పైకి చూసినప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి, కత్తి పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపి ఉంచిన యెహోవా దూత అతనికి కనిపించాడు. అప్పుడు దావీదు, పెద్దలు గోనెపట్ట కట్టుకుని సాష్టాంగపడ్డారు.
17
దావీదు దేవునితో, “యుద్ధవీరులను లెక్కించమని ఆదేశించింది నేనే కదా? గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? యెహోవా! నా దేవా, మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి, కాని మీ ప్రజలమీదికి ఈ తెగులు రానివ్వకండి” అన్నాడు.
18
అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని గాదుకు ఆజ్ఞాపించాడు.
19
కాబట్టి యెహోవా పేరిట గాదు చెప్పిన మాటకు లోబడి దావీదు బయలుదేరి వెళ్లాడు.
20
ఒర్నాను గోధుమలు నూరుస్తున్నప్పుడు, అతడు వెనుకకు తిరిగి ఆ దేవదూతను చూసి అతడు, అతనితో ఉన్న అతని నలుగురు కుమారులు దాక్కున్నారు.
21
అప్పుడు దావీదు వస్తూంటే, ఒర్నాను అతన్ని చూసి నూర్పిడి కళ్ళంలో నుండి బయటకు వచ్చి తలను నేలకు వంచి దావీదుకు నమస్కారం చేశాడు.
22
దావీదు ఒర్నానుతో, “ప్రజల మీద ఉన్న తెగులు ఆగిపోవడానికి ఈ నూర్పిడి కళ్ళం ఉన్న స్థలంలో నేను యెహోవాకు బలిపీఠం కట్టడానికి పూర్తి ఖరీదుకు దానిని నాకు అమ్ము” అని అన్నాడు.
23
అందుకు ఒర్నాను దావీదుతో, “నా ప్రభువా, రాజా తీసుకోండి! మీకు ఏది ఇష్టమో అది చేయండి. చూడండి, దహనబలులకు ఎద్దులు, నూర్చే కర్రలు కట్టెలు, భోజనార్పణ కోసం గోధుమలిస్తాను. ఇదంతా ఇచ్చేస్తాను” అని అన్నాడు.
24
అయితే రాజైన దావీదు ఒర్నానుతో, “లేదు, నీకు పూర్తి వెల చెల్లించి కొంటాను. నేను నీ వాటిని యెహోవా కోసం ఉచితంగా తీసుకోను లేదా నాకు ఖర్చు కాని దానితో దహనబలి అర్పించను” అన్నాడు.
25
కాబట్టి దావీదు ఆ స్థలానికి ఆరువందల షెకెళ్ళ బంగారాన్ని ఒర్నానుకు ఇచ్చాడు.
26
దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు అతడు యెహోవాకు ప్రార్థించగా, యెహోవా పరలోకం నుండి బలిపీఠం మీదికి అగ్నిని పంపి అతనికి జవాబిచ్చారు.
27
అప్పుడు యెహోవా దూతతో మాట్లాడగా అతడు తన కత్తిని తిరిగి ఒరలో పెట్టాడు.
28
ఆ సమయంలో యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవా తనకు జవాబిచ్చాడని గ్రహించి దావీదు అక్కడ బలులర్పించాడు.
29
మోషే అరణ్యంలో చేయించిన యెహోవా సమావేశ గుడారం, దహనబలి బలిపీఠం ఆ కాలంలో గిబియోనులోని ఎత్తైన స్థలంలో ఉన్నాయి.
30
అయితే దావీదు యెహోవా దూత యొక్క ఖడ్గానికి భయపడి, దేవుని దగ్గర విచారణ చేయడానికి ఆ స్థలానికి వెళ్లలేదు.
← Chapter 20
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 22 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29