bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
/
Job 12
Job 12
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
← Chapter 11
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 13 →
1
అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2
నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు, మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది!
3
అయినా మీకున్నట్లే నాకు కూడా గ్రహించే మనస్సు ఉంది, నేను మీకేమి తీసిపోను. ఈ విషయాలు తెలియనివారు ఎవరు?
4
నేను దేవునికి ప్రార్థించగా ఆయన సమాధానం ఇచ్చినప్పటికీ, నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలయ్యాను, నీతిగా నిందారహితంగా ఉన్న నేను నవ్వులపాలయ్యాను.
5
నిశ్చింతగా ఉన్నవారు అభాగ్యులను తిరస్కరిస్తారు, పాదాలు జారిపోతున్న వారి విధిని చూసి ఎగతాళి చేస్తారు.
6
బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి, దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు, వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.
7
కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి, ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.
8
భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది, సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.
9
వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని తెలుసుకోలేనివారు ఎవరు?
10
ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం మానవులందరి ఊపిరి ఉంది.
11
నాలుక ఆహారం రుచిని చూసినట్లు చెవి మాటలను పరిశీలించదా?
12
వృద్ధుల దగ్గర జ్ఞానం దొరకదా? దీర్ఘాయువు గ్రహింపును తీసుకురాదా?
13
జ్ఞానం శక్తి దేవునికి చెందినవి; ఆలోచన గ్రహింపు ఆయనవే.
14
దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కట్టలేరు; ఆయన బంధించిన వారిని ఎవరూ విడిపించలేరు.
15
ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి; ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి.
16
బలం వివేకం ఆయనకు చెందినవే; మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే.
17
ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు, న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు.
18
ఆయన రాజులు వేసిన సంకెళ్ళు తీసివేస్తారు వారి నడుము చుట్టూ తాడు కడతాడు.
19
యాజకులను దిగంబరులుగా చేసి నడిపిస్తారు, స్థిరంగా పాతుకుపోయిన అధికారులను పడగొడతారు.
20
నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు, పెద్దల వివేచనను తీసివేస్తారు.
21
ఆయన అధిపతుల మీద అవమానాన్ని కురిపిస్తారు, బలవంతులను నిరాయుధులనుగా చేస్తారు.
22
ఆయన చీకటిలోని లోతైన విషయాలను వెల్లడిస్తారు చిమ్మ చీకటిని వెలుగులోకి తెస్తారు.
23
ఆయన దేశాలను గొప్ప చేస్తారు వాటిని నాశనం చేస్తారు; దేశాలను విశాలపరుస్తారు వాటిని చెదరగొడతారు.
24
ఆయన భూలోక నాయకుల గ్రహింపును తీసివేస్తారు; వారు దారిలేని ఎడారిలో తిరుగులాడేలా చేస్తారు.
25
వారు వెలుగు లేదా చీకటిలో తడబడతారు; ఆయన వారిని త్రాగుబోతు తూలినట్లు తూలేలా చేస్తారు.
← Chapter 11
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 13 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42