bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
/
Song of Solomon 1
Song of Solomon 1
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 2 →
1
సొలొమోను రచించిన పరమ గీతములు.
2
అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి, నీ ప్రేమ ద్రాక్షరసం కంటే ఆహ్లాదకరమైనది.
3
మీ పరిమళ ద్రవ్యాల సువాసన హృదయానికి ఆనందాన్నిస్తుంది; మీ పేరు పోయబడిన పరిమళం లాంటిది. కాబట్టి యువతులు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు!
4
నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా! రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి. నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము; నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము. వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం!
5
యెరూషలేము కుమార్తెలారా, నల్లనిదానను, అయినా నేను సౌందర్యవతిని, కేదారు డేరాలవంటిదానను, సొలొమోను గుడారపు తెరల్లా నేనూ నల్లనిదాన్ని.
6
నల్లపిల్ల అని చెప్పి నన్నిలా తేరిచూస్తారేమి? ఎండకు నేను నల్లగా అయ్యాను. నా తల్లి కుమారులకు నా మీద కోపం నన్ను ద్రాక్షతోటను కావలి కాయడానికి పెట్టారు; అందుకే నా సొంత ద్రాక్షతోటను కాయలేక పోయాను.
7
నేను ప్రేమిస్తున్నవాడా, నీ గొర్రెల మందను ఎక్కడ మేపుతున్నావో మధ్యాహ్నం మీ మందను విశ్రాంతికి ఎక్కడ ఉంచుతున్నావో చెప్పు. మీ స్నేహితుల మందల ప్రక్కన నేను ముసుగు వేసుకున్న స్త్రీలా ఎందుకు ఉండాలి?
8
స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఒకవేళ నీకు తెలియకపోతే, మందల అడుగుజాడలను బట్టి వెళ్లు, కాపరుల డేరాల ప్రక్కన నీ మేక పిల్లలను మేపుకో.
9
నా ప్రియురాలా, నీవు అద్భుతం నీవు ఫరో రథం యొక్క గుర్రాల్లా ఉన్నావు.
10
మీ బుగ్గలు చెవిపోగులతో, నీ మెడ హారాలతో అందంగా ఉన్నాయి.
11
బంగారు చెవిపోగులు చేస్తాము వెండి పూసలతో అలంకరిస్తాము.
12
రాజు బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు, నా పరిమళపు సువాసన అంతా గుబాళించింది.
13
నా ప్రియుడు నా స్తనముల మధ్య ఉన్న, బోళం సంచిలా ఉన్నాడు.
14
ఎన్-గేదీ ద్రాక్షవనంలో వికసించిన గోరింట పూలగుత్తి లాంటివాడు నా ప్రియుడు.
15
నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! ఓ, ఎంతో అందాలరాశివి! నీ కళ్లు గువ్వలు.
16
నా ప్రియుడా! నీవు ఎంత సౌందర్యమూర్తివి! ఓ, నీవు ఎంతో అందమైనవాడవు! మనకు పడక ప్రశాంతము.
17
మన గృహం దేవదారు దూలాలు! మన వాసాలు సరళవృక్షాల మ్రానులు.
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 2 →
All chapters:
1
2
3
4
5
6
7
8