bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
Jonah 2
Jonah 2
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 3 →
1
చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా ఇలా అన్నాడు:
2
“నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను యెహోవా సహాయం అర్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు! నేను పాతాళపు లోతుల్లో ఉన్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుకొనగా నీవు నా మొరాలకించావు!
3
“నీవు నన్ను సముద్రంలోకి విసరివేశావు. తీవ్రమైన నీ అలలు నన్ను ముంచెత్తాయి. నేనీ అగాధ సముద్రం లోతులదాకా పోయాను. నా చుట్టూ జల ప్రళయం.
4
‘ఇక నేను చూడలేని స్థలానికి తోయబడ్డాను’ అని అనుకున్నాను. కాని సహాయం కొరకు నేను నీ పవిత్ర ఆలయం వైపు చూస్తూనే ఉన్నాను.
5
“సముద్రజలం నన్ను ముంచివేసింది. నీరు నా నోటిని మూసివేసింది, నేను శ్వాస పీల్చుకోలేకుండా ఉన్నాను. ఈ సముద్రపు లోతులలోకి నేను వెళ్లాను. సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి.
6
పర్వతాల పునాదులున్న చోట, సముద్రపు అట్టడుగున నేను ఉన్నాను. ఈ చెరలో నేను శాశ్వతంగా మూయబడి ఉన్నాననుకున్నాను. కానీ నా దేవుడైన యెహోవా నన్ను నా సమాధినుండి బయటకు లేపాడు! ఓ నా దేవా, నీవు నాకు మళ్లీ ప్రాణం పోశావు!
7
“నా ఆత్మ నిరాశ చెందింది, అప్పుడు నేను యెహోవాను తలచుకొన్నాను. యెహోవా, నిన్ను నేను ప్రార్థించాను. నీ పవిత్రాలయంలో నీవు నా ప్రార్థనలు విన్నావు.
8
“కొంతమంది ప్రజలు పనికిరాని విగ్రహాలను పూజిస్తారు. కానీ ఆ విగ్రహాలు వారికి ఎన్నడూ సహాయం చేయలేవు.
9
యెహోవానుండి మాత్రమే రక్షణ లభిస్తుంది! యెహోవా, నీకు నేను బలులు అర్పిస్తాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీకు నేను ప్రత్యేక మొక్కులు మొక్కుతాను. నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను.”
10
అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరువాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాను పొడిగా ఉన్న నేలమీదకు కక్కివేసింది.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 3 →
All chapters:
1
2
3
4