bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
Nehemiah 7
Nehemiah 7
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 8 →
1
ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము.
2
అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకు అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు.
3
అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకుగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”
4
అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసినంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు.
5
జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగొట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.
6
చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు నెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన స్వంత పట్టణానికి పోయాడు.
7
ఈ క్రిందివాళ్లు జెరుబ్బాబెలు తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:
8
పరోషు వంశీయులు 2,172
9
షెపట్యా వంశీయులు 372
10
ఆరహు వంశీయులు 652
11
పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు వంశపు వాళ్లు) 2,818
12
ఏలాము వంశీయులు 1,254
13
జత్తూ వంశీయులు 845
14
జక్కయి వంశీయులు 760
15
బిన్నూయి వంశీయులు 648
16
బేబై వంశీయులు 628
17
అజ్గాదు వంశీయులు 2,322
18
అదోనీకాము వంశీయులు 667
19
బిగ్వయి వంశీయులు 2,067
20
ఆదీను వంశీయులు 655
21
హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు 98
22
హాషూము వంశీయులు 328
23
బేజయి వంశీయులు 324
24
హారీపు వంశీయులు 112
25
గిబియోను వంశీయులు 95
26
బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు 188
27
అనాతోతు పట్టణం వాళ్లు 128
28
బేతజ్మావెతు పట్టణం వాళ్లు 42
29
కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్టణాల వాళ్లు 743
30
రమా, గెబ పట్టణాల వాళ్లు 621
31
మిక్మషు పట్టణం వాళ్లు 122
32
బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు 123
33
రెండవ నెబో పట్టణం వాళ్లు 52
34
రెండవ ఏలాము పట్టణం వాళ్లు 1,254
35
హారిము పట్టణం వాళ్లు 320
36
యెరికో పట్టణం వాళ్లు 345
37
లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు 721
38
సెనాయా పట్టణం వాళ్లు 3,930
39
వీళ్లు యాజకులు: యేషూవా కుటుంబం ద్వారా యెదాయా వంశీయులు 973
40
ఇమ్మేరు వంశీయులు 1,052
41
పషూరు వంశీయులు 1,247
42
హారిము వంశీయులు 1,017
43
లేవీ వంశానికి చెందిన వాళ్లు: యేషువా, హోదేయా, కద్మీయులు 74
44
వీళ్లు గాయకులు: ఆసావు వంశీయులు 148
45
వీళ్లు ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబ, హటీటాం, షోబయి వంశీయులు 138
46
వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయేలు
47
కేరోసు, సీయహా, పాదోను,
48
లెబానా, హగాబా, షల్మయి,
49
హానాను, గిద్దేలు, గహరు
50
రెవాయ, రెజీను, నెకోదా,
51
గజ్జాము, ఉజ్జా, పాసెయ.
52
బేసాయి, మెహూనీము, నెపూషేసీము.
53
బక్బూకు, హకూఫా, హర్హూరు,
54
బజ్లీతు, మెహీదా, హర్షా,
55
బర్కోసు, సీసెరా, తెమాహా,
56
నెజీయహు, హటేపా.
57
సొలొమోను దాసుల వంశాలకు చెందిన వారు: సొటయి, సోపెరెతు, పెరూదా,
58
యహలా, దర్కొను, గిద్దేలు,
59
షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.
60
ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం 392
61
కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.
62
దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు 642
63
యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా పరిగణింపబడ్డారు.)
64
వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చబడలేదు.
65
అత్యంత పవిత్రమైన వస్తువులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము ఉపయోగించి, దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి, ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశుద్ధ వస్తువుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.
66
మొత్తం మీద, ఆ బృందంలో తిరిగి వచ్చిన వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7,337 దాసదాసీలు ఈ మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు.
68
వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు వున్నాయి.
70
కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు.
71
కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనుల బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు.
72
మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము, 1 1/3 టన్నుల వెండిని, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు.
73
ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమ తమ స్వంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ స్వంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల నాటికి ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 8 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13