bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu (BSI) 1880
/
Deuteronomy 26
Deuteronomy 26
Telugu (BSI) 1880
← Chapter 25
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 27 →
1
నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చు... చున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు
2
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామ మునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి
3
ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయియెహోవా మన పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి యున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను.
4
యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవు డైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా
5
నీవునా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తు నకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను.
6
ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా
7
మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి నప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.
8
అప్పుడు యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహా భయమువలనను సూచక క్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి
9
యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను.
10
కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమియొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవు డైన యెహోవా సన్నిధిని చెప్పి
11
నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి, నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీ యులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింప వలెను.
12
పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేనివారికిని విధవ రాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తిపొందినతరు వాత
13
నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధినినీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్టితమైనదానిని తీసివేసి, లేవీయుల కును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.
14
నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై యుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్య లేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నా కాజ్ఞాపించినట్లు సమస్తము జరిపి యున్నాను.
15
నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులనుపాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమా ణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.
16
ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటి ననుసరించి నడుచుకొనవలెను.
17
యెహోవాయే నీకు దేవుడై యున్నాడనియు, నీవు ఆయన మార్గములయందు నడిచి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అను సరించి, ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట యిచ్చితివి.
18
మరియు యెహోవా నీతో చెప్పి నట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు,
19
తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిం చుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహో వాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.
← Chapter 25
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 27 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34