bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
2 Kings 17
2 Kings 17
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 16
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 18 →
1
ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలులో షోమ్రోను నుంచి పరిపాలించసాగాడు. అహాజు యూదా రాజుగా ఉన్న 12వ సంవత్సరమున ఇది జరిగింది. హోషేయా తొమ్మిదేళ్లు పరిపాలించాడు.
2
యెహోవా తప్పనిచెప్పిన పనులు హోషేయా చేశాడు. కాని హోషేయా తనకు పూర్వికులైన ఇశ్రాయేలు రాజులవలె చెడ్డవాడు కాదు.
3
షల్మనేసెరు అష్షూరుకు రాజు. అతను హోషేయాకి ప్రతికూలంగా యుద్ధానికి వెళ్లాడు. షల్మనేసెరు హోషేయాని ఓడించాడు. మరియు హోషేయా అతని సేవకుడయ్యాడు. అందువల్ల హోషేయా షల్మనేసెరుకు పన్ను చెల్లించాడు.
4
తర్వాత, హోషేయా ఈజిప్టు రాజు సహాయం కోరుతూ దూతలను పంపాడు. ఆ రాజు పేరు సో. ఆ సంవత్సరం హోషేయా తాను ప్రతియేడు చేసేవిధంగా అష్షూరు రాజుకి కప్పం కట్టలేదు. అష్షూరు రాజు తనకు విరుద్ధంగా హోషేయా పథక రచన చేసినట్లు తెలుసుకున్నాడు. అందువల్ల అష్షూరు రాజు హోషేయాని ఖైదుచేసి చెరసాలలో వేశాడు.
5
అష్షూరు రాజు ఇశ్రాయేలులో చాలా స్థలాలపై దాడి చేశాడు. తర్వాత షోమ్రోనుకు అతను వచ్చాడు. అతను షోమ్రోనుకి ప్రతికూలంగా మూడు సంవత్సరాలు యుద్ధం చేశాడు.
6
అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున షోమ్రోనును తీసుకున్నాడు. అష్షూరు రాజు చాలా మంది ఇశ్రాయేలు వారిని బంధించి, వారిని బంధీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారినతడు గోజాను వద్ద హాబోరు నదికి ప్రక్కగా హలాహు అనే చోటను, మాదీయుల ఇతర నగరాలలోను నివసింపజేశాడు.
7
ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కనుక, ఈ విషయాలు జరిగాయి. ఆ యెహోవాయే ఈజిప్టు నుండి ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకువచ్చాడు. మరియు ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి యెహోవాయే రక్షించాడు. కాని ఇశ్రాయేలు వారు ఇతర దేవుళ్లను పూజించసాగారు. ఈజిప్టు రాజైన ఫరో అధికారం నుండి యెహోవా వారిని సంరక్షించాడు.
8
ఇతర జనాంగములు చేసినట్లుగానే, వారు చేయసాగారు. ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఆ జనాంగములను వారిని తమ ప్రదేశము వదిలి వెళ్లాలని యెహోవా చేత నిర్బంధించబడ్డారు. ఇశ్రాయేలు వారు కూడా దేవునివల్ల గాక రాజులచే పరిపాలించబడాలని ఎంచుకున్నారు.
9
ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధమైన సంగుతులను రహస్యంగా చేశారు. వారు చేసినవి సరి అయినవి కావు! తమ నగరాలన్నిటిలోను ఇశ్రాయేలువారు చిన్న పట్టణం నుంచి పెద్ద నగరం దాకా ఉన్నత స్థలాలు నిర్మించారు.
10
ఇశ్రాయేలువారు స్మారక శిలలు వేశారు. ప్రతి కొండమీదను పచ్చని చెట్ల క్రిందను అషెరా స్తంభాలు ఏర్పాటు చేశారు.
11
అన్ని ఆరాధనా స్థలాలలోను ఇశ్రాయేలువారు ధూపం వేసేవారు. యెహోవా జనాంగములను తమ కళ్ల ఎదుటే బలవంతంగా విడిచిపెట్టి వెళ్లమని చెప్పిన విధంగా, వారీ పనులు చేసేవారు. ఇశ్రాయేలువారు చేసినచెడుపనులు యెహోవాకి ఆగ్రహం కలిగించాయి.
12
వారు విగ్రహలను కొలిచారు. “మీరీ పని చేయకూడదు” అని యెహోవా ఇశ్రాయేలువారికి చెప్పాడు.
13
ఇశ్రాయేలుని యూదాని హెచ్చరిక చేసేందుకు యెహోవా ప్రతి ప్రవక్తను, దీర్ఘదర్శిని ఉపయోగించాడు. “మీరు చేసే చెడు పనులకు అయిష్టత చూపండి. నా ఆజ్ఞలను చట్టాలను పాటించండి. మీ పూర్వికులకు నేనిచ్చిన ధర్మశాస్త్రమును మీరు అనుసరించండి. ఈ ధర్మశాస్త్రాన్ని నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అందించాను” అని యెహోవా చెప్పాడు.
14
కాని ప్రజలు ఆ మాటలు వినలేదు. తమ పూర్వికులవలె వారు మొండిగా వుండిరి. వారి పూర్వీకులు తమ యెహోవా దేవుని విశ్వసించలేదు.
15
ప్రజలు యెహోవా చట్టాలను అంగీకరించలేదు. తమ పూర్వికులతో యెహోవా చేసిన ఒడంబడికను అంగీకరింలేదు. వారు యెహోవా చేసిన హెచ్చరికలను పాటించలేదు. ఎందుకు విలువలేని విగ్రహములను వారు కొలిచారు, మరియు వారు ఎందుకు విలువలేనివారయ్యారు. తమ చుట్టూ వున్న జనాంగములవలె వారు ఆ ప్రజల చెడు జీవిత పద్దతిని అనుసరించారు. మరియు యెహోవా ఇశ్రాయేలు ప్రజలను, హెచ్చరించి, ఆ చెడు పనులు చేయవద్దని చెప్పాడు.
16
తమ యెహోవా దేవుని ఆజ్ఞలను ప్రజలు పాటించడం మానివేశారు. వారు రెండు బంగారు దూడల విగ్రహాలు చేశారు. అషెరా స్తంభాలు వారు ఏర్పాటు చేశారు. వారు ఆకాశంలోని అన్ని నక్షత్రాలను పూజించారు; బయలు దేవతలను కొలిచారు.
17
వారు తమ కొడుకుల్ని, కూతుళ్లని అగ్నిలో వేసి బలి ఇచ్చారు. భవిష్యత్తును తెలుసుకునేందుకు వారు చేతబడితనమును, ఇంద్రజాలమును ఉపయోగించారు. దుష్కార్యమని యెహోవా చెప్పినదానిని ప్రజలు చేశారు. యెహోవాని ఆగ్రహపరచేందుకు వారు అలా చేశారు.
18
అందువల్ల యెహోవా ఇశ్రాయేలుపట్ల చాలా కోపపడ్డాడు; తన దృష్టినుంచివారిని తప్పించాడు. యూదా గోత్రం తప్ప మరి ఇతర ఇశ్రాయేలువారు లేరు.
19
యూదా ప్రజలు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలవలె నివసించారు.
20
యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరిని త్రోసిపుచ్చాడు. అతడు వారికి ఎన్నో ఇబ్బందులు కలుగ జేశాడు. ఇతరులు తమను నాశనం చేసేటట్లు చేసుకున్నారు. చిట్టచివరికి, ఆయన తన దృష్టినుండి వారిని త్రోసిపుచ్చాడు.
21
యెహోవా దావీదు వంశం నుంచి ఇశ్రాయేలుని విడగొట్టాడు. మరియు ఇశ్రాయేలువారు నెబాతు కుమారుడైన యరొబామును తమ రాజుగా చేసుకున్నారు. యరొబాము యెహోవాను అనుసరించని వారుగా వారిని గుర్తించాడు. ఇశ్రాయేలువారు మహా పాపం చేసేలా యరొబాము చేశాడు. అందువల్ల
22
ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపాలన్నీ చేశారు.
23
యెహోవా తన దృష్టినుండి ఇశ్రాయేలుని దూరముగా తీసుకుపోయే వరకు, వారు ఆ పాపాలు చేయడం మానలేదు. మరియు ఇలా జరుగునని యెహోవా చెప్పాడు! ఆయన ప్రజలకు ఇలా జరుగుతుందని చెప్పమని ప్రవక్తలను పంపించాడు. అందువల్ల ఇశ్రాయేలువారిని తమ దేశంనుండి అష్షూరుకు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ వారు నేటిదాకా వున్నారు.
24
అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని షోమ్రోను నుండి వెలుపలికి తీసుకు వచ్చాడు. తర్వాత అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్యా, హమాతు, సెపర్వయీముల నుండి మనుష్యులను తీసుకువచ్చాడు. అతను వారినందరిని షోమ్రోనులో ఉంచాడు. ఆ ప్రజలు షోమ్రోనును గ్రహించి ఆ చుట్టు ప్రక్కల నగరాలలో నివసింపసాగారు.
25
ఈ ప్రజలు షోమ్రోనులో ఉండసాగిన తర్వాత, యెహోవాని వారు గౌరవించలేదు. అందువల్ల ప్రభువు వారిమీదికి సింహాలను పంపించాడు. ఈ సింహాలు కొందరిని చంపివేశాయి.
26
కొందరు అష్షూరు రాజుతో, “నీవు తీసుకువచ్చి షోమ్రోను నగరాలలో నిలిపిన ప్రజలకు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలు తెలియవు. అందువల్ల దేవుడు సింహాలను పంపి వారిని ఎదుర్కొన్నాడు. ఆ ప్రజలకు ఆ ప్రదేశపు దేవుని చట్టాలు తెలియవు కనుక వారిని సింహాలు చంపివేశాయి” అని చెప్పారు.
27
అందువల్ల అష్షూరు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు షోమ్రోను నుండి కొందరు యాజకులను తీసుకున్నారు. నేను బంధించిన యాజకులలో ఒకరిని తిరిగి షోమ్రోనుకు పంపించండి. ఆ యాజకుడ్ని వెళ్లి అక్కడే వుండనివ్వండి. తర్వాత ఆ యాజకుడు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలను వారికి బోధించగలడు.”
28
అందువల్ల అష్షూరుకు తీసుకుపోయిన ఒక యాజకుడు బేతేలులో నివసించాడానికి వచ్చాడు. ఈ యాజకుడు యెహోవాని ఎలా గౌరవించాలో వాళ్లకి బోధించాడు.
29
కాని ఆ మనుష్యులందరు తమతమ దేవుళ్ల విగ్రహలను చేసి షోమ్రోనుల ఉన్నత స్థానాలలో ఆలయాలలో ఆ విగ్రహలను ఉంచారు.
30
బబులోను మనుష్యులు అబద్ధపు దేవుడైన సుక్కోల్బెనోతును కల్పించుకున్నారు. కూతా మనుష్యులు అబద్ధపు దేవుడైన నెర్గలుని కల్పించుకున్నారు.
31
అవ్వాకు చెందినవారు అసత్య దేవుడైన నిబ్హజు తర్తాకులను కల్పించుకున్నారు. హమాతు ప్రజలు అబద్ధపు దేవుడైన అషీమాని కల్పించుకున్నారు. మరియు సెపర్వీయుల నుండి వచ్చిన ప్రజలు తమ అసత్యపు దేవుళ్లయిన అద్రమ్మెలెకు, అనెమ్మెలెకుల గౌరవార్థం తమ సంతానాన్ని అగ్నికి ఆహుతి చేశారు.
32
కాని ఆ ప్రజలు యెహోవాని కూడా పూజించారు. ప్రజలనుండి ఉన్నత స్థానాలకు వారు యాజకులను ఎంపిక చేశారు. ఆ ఆరాధనా స్థలాలలో ఈ యాజకులు ఆలయాలలో ప్రజలకోసం బలులు అర్పించారు.
33
వారు యెహోవాని గౌరవించారు; కాని వారు తమ సొంత దేవుళ్లను కూడా సేవించారు. ఆ ప్రజలు తాము తీసుకొని రాబడిన దేశాలలో జరిగించినట్లుగానే తమ దేవుళ్లను పూజించారు.
34
నేటికీ ఆ ప్రజలు పూర్వం వున్నట్లుగానే నివసిస్తున్నారు. వారు యెహోవాని గౌరవించరు. వారు ఇశ్రాయేలువారి నిబంధనలను, ఆజ్ఞలను పాటించరు. వారు యాకోబు పిల్లలకు (ఇశ్రాయేలు) విధించిన ఆజ్ఞలనుగాని నిబంధనలను గాని పాటించ లేదు.
35
యెహోవా ఇశ్రాయేలువారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. యెహోవా, “మీరు ఇతర దేవతలను అనుసరించకూడదు. మీరు వారిని పూజించకూడదు; ఆరాధించకూడదు; వారికి బలుల కూడా సమర్పించకూడదు.
36
కాని యెహోవాని అనుసరించాలి. ఈజిప్టు నుంచి మిమ్ము తీసుకువచ్చిన యెహోవాయే దేవుడు. యెహోవా తన గొప్ప శక్తిని మిమ్ము రక్షించడానికి వినియోగించాడు. మీరు యెహోవాని ఆరాధిస్తూ మరియు గౌరవించి ఆయనకు బలులు సమర్పించాలి.
37
ఆయన మీ కోసం వ్రాసిన నిబంధనలు, న్యాయ సూత్రాలు, బోధనలు, ఆజ్ఞలు మొదలైన వాటిని మీరు పాటించాలి. ఎప్పుడూ మీరీ విషయాలు పాటించాలి. మీరు ఇతర దేవతలను గౌరవించరాదు.
38
మీతో నేను చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు.
39
మీరు మీ దేవుడైన యెహోవానే గౌరవించాలి. తర్వాత ఆయన మిమ్మును మీ విరోధులనుండి సంరక్షిస్తాడు.” అని ఆజ్ఞాపించాడు.
40
కాని ఇశ్రాయేలువారు వినలేదు. పూర్వం చేసినట్లుగానే వారు అవే పనులు చేయసాగారు.
41
అందువల్ల ఇప్పుడు ఇతర జనాంగంవారు యెహోవాను గౌరవిస్తారు. అలాగే తమ సొంత విగ్రహాలను కూడా పూజిస్తారు. తమ పూర్వికులు చేసినట్లుగానే, వారి పిల్లలు మనుములు, మనుమరాండ్రు అవే పనులు చేస్తున్నారు. ఈ నాటికీ వారు అవే పనులు చేస్తున్నారు.
← Chapter 16
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 18 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25