bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
2 Kings 7
2 Kings 7
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 8 →
1
దేవుని సందేశం వినండి. యెహోవా చెప్పుచున్నాడు. “రేపు ఈపాటికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అది మరల చౌకగా దొరకుతుంది. సమారియ నగర ద్వారం వద్ద ఒక రూపాయికి ఒక బుట్ట సన్నని మేలు రకం పిండి, ఇంకొక రూపాయికి రెండు బుట్టల (సేరుల) యవలు అమ్మబడును.”
2
తర్వాత రాజుకు దగ్గరగా వున్న అధికారి దేవుని వ్యక్తి ఎలీషాకి సమాధానమిచ్చాడు. “పకలోకపు కిటికీలు యెహోవా తెరిచినా, ఇది జరగదు” అని ఆ అధికారి చెప్పాడు. “నీవు నీ కళ్ళతో అది చూడగలవు. కాని ఆ ఆహారం కొంచమైనా నీవు తినలేవు” అని ఎలీషా చెప్పాడు.
3
నగర ద్వారం వద్ద నలుగురు కుష్ఠరోగులుండిరి. వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకున్నారు: “కూర్చుని మరణించాడానికి నిరీక్షిస్తున్నామా?
4
షోమ్రోనులో ఆహారంలేదు. మనము నగరంలోకి వెళితే, మనమక్కడ చనిపోతాము. ఇక్కడ ఉంటే, చనిపోతాము. కనుక మనము సిరియనుల గుడారానికి వెళదాము. వాళ్లు కనుక మనలను అక్కడ ఉండనిస్తే, అప్పుడు మనం బ్రతుకుదాము. వాళ్లు మనలను చంపితే మనము మరణిద్దాము.”
5
అందువల్ల ఆ సాయంకాలం ఆ నలుగురు కుష్ఠరోగులు సిరియనుల గుడారానికి వెళ్లారు. వారు గుడారం అంచుదాకా వెళ్లారు. అక్కడ మనుష్యులెవ్వరూ లేరు.
6
సిరియనుల గుడారం వారు రథాలు, గుర్రాలు, సైన్యం వస్తున్న సవ్వడిని సిరియనుల సైన్యం వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అందువల్ల సిరియనుల సైనికులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఇశ్రాయేలు రాజు హిత్తీయుల, ఈజీప్టీయుల రాజులను మనకు ప్రతికూలంగా జీతమిచ్చి వాడుకున్నాడు.”
7
ఆ సాయంకాలమే సిరియావారు అన్నీ అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. వారు తమ గుడారాలు విడిచిపెట్టారు. గుర్రాలు, గాడిదలు మొదలైనవి కూడా విడిచి పెట్టి ప్రాణాలకోసం పారిపోయారు.
8
శిబిరం ప్రారంభమైన చోటికి ఈ కుష్ఠరోగులు వచ్చారు. వారు ఒక గుడారంలోకి వెళ్లారు. వారు తిన్నారు; త్రాగారు. తర్వాత ఆ కుష్ఠరోగులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన వాటిని తీసుకున్నారు. వెండి బంగారాలు వస్త్రాలను వారు దాచివేశారు. తర్వాత వెనక్కి వచ్చి మరొక గుడారంలో ప్రవేశించారు. ఈ గుడారం నుంచి వస్తువులను బయటికి చేరవేశారు. ఈ వస్తువులను కూడా వారు దాచివేశారు.
9
తర్వాత ఈ కుష్ఠరోగులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “మనము తప్పు చేస్తున్నాము. నేడు మనకు మంచి వార్త కలదు. కాని మనము మౌనంగా ఉన్నాము. మళ్లీ సూర్యుడు వచ్చేంతవరకు మనము వేచివుంటే, మనము శిక్షింపబడతాము. ఇప్పుడే మనము వెళ్లిపోదాము. రాజు గారి భవనంలో వున్న మనష్యులకు చెపుదాము.”
10
ఆ తరువాత కుష్ఠరోగులు వచ్చి, నగర ద్వారపాలకులతో చెప్పారు: “మేము సిరియావారి శిబిరాలకు వెళ్లాము. కాని మేము ఎవ్వరి గొంతు వినలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. గుర్రాలు గాడిదలు ఇంకా కట్టివేయబడివున్నాయి. గుడారాలు అలాగేవున్నాయి. కాని మనుష్యులందరూ వెళ్లిపోయారు.”
11
తర్వాత నగర ద్వారపాలకులు కేకలు వేసి రాజ భవనంలోని వారికి చెప్పారు.
12
అది రాత్రిగడియ. అప్పుడు రాజు పడక నుండి లేచాడు. తన అధికారులతో రాజు, “సిరియా సైనికులు మనకేమి చేస్తున్నారో మీకు చెప్తాను. మనము ఆకలిగా వున్నామని వారికి తెలుసు. పొలాలలో దాగుకొనడానికి వారు విడిదిని విడిచిపెట్టి వెళ్లారు. నగరం వెలుపలికి ఇశ్రాయేలువారు రాగానే, వారిని సజీవంగా మనము పట్టుకోవచ్చు, తర్వాత మనం నగరం ప్రవేశిద్దాము అని వారనుకొంటున్నారు” అని చెప్పాడు.
13
రాజు ఉద్యోగులలో ఒకడు, “నగరంలో ఇంకా మిగిలిన ఐదు గుర్రాలను కొంతమంది పురుషులు తీసుకొని పోనివ్వండి. నగరంలో ఇంకా మిగిలిన ఇశ్రాయేలువారివలె ఆ గుర్రాలు ఎలాగైనా మరణించేవే. ఏమి జరిగిందో తెలుసుకోడానికి ఈవ్యక్తులను మనము పంపిద్దాము” అని చెప్పాడు.
14
అందువల్ల గుర్రాలు కట్టిన రెండు రథాలను ఆ మనుష్యులు తీసుకున్నారు. ఆ మనుష్యులను సిరియను సైన్యము వెనుక పంపాడు. “వెళ్లి ఏమి జరిగిందో చూడండి” అని రాజు చెప్పాడు.
15
యోర్దాను నదిదాకా ఆ మనుష్యులు సిరియను సైన్యము వెనుకగా వెళ్లారు. ఆ మార్గమంతటా వస్త్రాలు, ఆయుధాలు వున్నాయి. సిరియావారు పారిపోయినప్పుడు ఆ వస్తువులను వదిలి వేశారు. ఆ దూతలు వెనుకకు వెళ్లి షోమ్రోను చేరుకొని రాజుకు చెప్పారు.
16
తర్వాత ఆ ఇశ్రాయేలీయులు సిరియను శిబిరానికి పరిగెత్తుకుని వెళ్లి, అక్కడినుండి విలువగల వస్తువులు తీసుకున్నారు. ప్రతి ఒక్కనికి వస్తువులు సమృద్ధిగా వున్నాయి. అందువల్ల యెహోవా చెప్పినట్లుగానే అది జరిగింది. ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్ట మరియు ఒక్క రూపాయికి రెండు బుట్టల యవలు అమ్మబడెను.
17
రాజు తన సన్నిహితుడయిన ఉద్యోగిని ద్వార సంరక్షణకు ఎంపిక చేసెను. కాని ప్రజలు విరోధి శిబిరము నుండి వస్తువులను పొందడానికి పరుగెత్తి, వారు ఆ ఉద్యోగిని క్రిందికి తోసి అతని మీదుగా నడిచారు. రాజు దేవుని వ్యక్తి అయిన ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు, అతను చెప్పినట్లుగానే ఆ ఉద్యోగి మరణించాడు.
18
ఎలీషా కూడ ఇలా సూచించాడు: “ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్ట మరియు ఒక్కరూపాయికి రెండు బుట్టల యవలు అమ్మబడెను. సమారియ నగర ద్వారముల వద్ద గల అంగడి వీధివద్ద ప్రతివారు కొనగలరు.”
19
కాని ఆ ఉద్యోగి దేవుని వ్యక్తికి చెప్పిన సమాధాన మేమిటంటే, “యెహోవా పరలోకపు కిటికీలు తెరచినా, ఇలా జరగదు” అని. ఎలీషా ఆ ఉద్యోగితో ఇలా చెప్పివుండెను. “నీవు నీ కళ్లతోనే చూడగలవు, కాని నీవు ఆ ఆహారమేమీ భుజింపవు.”
20
ఆ విధంగానే, ఆ ఉద్యోగికి జరిగింది. ప్రజలు ద్వారం దగ్గర అతనిని క్రిందికి తోసి, అతని మీదుగా నడిచారు. అతను మరణించాడు.
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 8 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25