bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
Song of Solomon 2
Song of Solomon 2
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 3 →
1
నేను షారోనులోని గులాబి పువ్వును. లోయలలోని సుగంధ పుష్పాన్ని.
2
నా ప్రియురాలా, ఇతర స్త్రీలలో నీవు ముళ్ల మధ్య గులాబి పుష్పంలా ఉన్నావు!
3
నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు అడవిచెట్ల మధ్య జల్దరు చెట్టులా ఉన్నావు! ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను! నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని ఫలం నాకెంతో రుచికరంగా వుంది.
4
నా ప్రియుడు నన్ను ద్రాక్షారసశాలకు తీసుకుని వచ్చాడు, నా మీద అతని ఉద్దేశం ప్రేమ.
5
ఎండు ద్రాక్షాలతో నాకు బలాన్నివ్వండి, జల్దరు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను.
6
నా ప్రియుని ఎడమ చేయి నా తల క్రింద ఉంది, అతని కుడి చేయి నన్ను కౌగలించుకొంది.
7
యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్ల మీద ఒట్టేసి నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ. ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు.
8
నా ప్రియుని గొంతు వింటున్నాను. అదిగో అతడు వస్తున్నాడు. పర్వతాల మీది నుంచి దూకుతూ కొండల మీది నుంచి వస్తున్నాడు.
9
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక కిటికీలోనుంచి చూస్తూ
10
నా ప్రియుడు నాతో అంటున్నాడు, “నా ప్రియురాలా, లెమ్ము, నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!
11
చూడు, శీతాకాలం వెళ్లిపోయింది, వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి.
12
పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! విను, పావురాలు తిరిగి వచ్చాయి.
13
అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు. నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా, మనం వెళ్లిపోదాం!”
14
కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా! నిన్ను చూడనిమ్ము, నీ గొంతు విననిమ్ము, నీ గొంతు ఎంతో మధురం, నువ్వెంతో సుందరం!
15
మాకోసం గుంటనక్కల్ని ద్రాక్షాతోటల్ని పాడుచేసే చిన్న గుంటనక్కల్ని పట్టుకోండి! మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది.
16
నా ప్రియుడు నావాడు, నేను అతని దానను! అతడు సుగంధ పుష్పాల పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!
17
నా ప్రియుడా, సూర్యాస్తమయమై, ఇక నీడలు మాయమయ్యే వేళలో చీలిన పర్వతాల మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు!
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 3 →
All chapters:
1
2
3
4
5
6
7
8