bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
Song of Solomon 7
Song of Solomon 7
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 8 →
1
రాకుమారీ, నీ పాదరక్షల్లో నీ అడుగులెంతో అందంగా ఉన్నాయి నీ తొడల వంపులు శిల్పి మలిచిన ఆభరణాల్లా ఉన్నాయి.
2
నీ నాభి గుండ్రటి కలశం (జాడి)లా ఉంది దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక. నీ ఉదరం (కడుపు) పద్మ వలయితమైన గోధుమ రాశిలా ఉంది.
3
నీ స్తనాలు తామరలో మేసే ఒక కవల జింక పిల్లల్లా ఉన్నాయి.
4
నీ మెడ దంతపు గోపురంలా ఉంది నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న హెష్బోనులోని రెండు తటాకాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే లెబానోను శిఖరంలా ఉంది.
5
నీ తల కర్మెలు పర్వతంలా, నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి. నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా నీ వశం అవుతాడు.
6
నీవు అతీత సుందరివి! అత్యంత మనోహరివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!
7
నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి.
8
నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని, దాని మట్టలు పట్టాలని ఉంది. నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా, నీ ఊపిరి జల్దరు సువాసనలా ఉన్నాయి.
9
నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా, అది నిద్రించే వారి ప్రేమ పెదవులకు జాలువారేదిలా ఉంది.
10
నేను నా ప్రియునిదానను నాయందు అతనికి వాంఛ ఉంది!
11
ఓ నా ప్రియుడా రమ్ము, పొలానికి వెళదాము రమ్ము, పల్లెల్లో రేయి గడుపుదాము రమ్ము,
12
పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో లేదో ఆ మొగ్గలు విచ్చుకున్నాయో లేదో దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము, రమ్ము. అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రమ్ము.
13
ప్రేమ వర్ధక మండ్రేక ఔషధుల్నీ మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు! ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ, దోరవీ పండ్లు, తిని చూడు!
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 8 →
All chapters:
1
2
3
4
5
6
7
8