bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
Song of Solomon 3
Song of Solomon 3
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 4 →
1
రాత్రి నా పరుపు మీద, నేను ప్రేమించిన వానికోసం వెదికాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుగొనలేకపోయాను!
2
ఇప్పుడు లేచి, నగరమంతా తిరుగుతాను. వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
3
నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు. వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?” అని.
4
కావలివాళ్లను దాటిన వెంటనే నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను! అతణ్ణి పట్టుకున్నాను. అతణ్ణి పోనివ్వలేదు, నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని వచ్చాను. నన్ను కన్న తల్లి గదికి తీసుకొని వచ్చాను.
5
యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్లమీద ఒట్టు పెట్టి, నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు.
6
పెద్ద జనం గుంపుతో ఎడారినుండి వస్తున్న ఈ స్త్రీ ఎవరు? కాలుతున్న గోపరసం, సాంబ్రాణి ఇతర సుగంధ ద్రవ్యాల సువాసనలతో పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.
7
చూడు, సొలొమోను ప్రయాణపు పడక! అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు. వారు బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు!
8
వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు, వారి పక్కనున్న కత్తులు, ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం!
9
రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు పడక చేయించాడు, దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది.
10
దాని స్తంభాలు వెండితో చేయబడ్డాయి, ఆధారాలు (కోళ్ళు) బంగారంతో చేయబడ్డాయి, పడుకొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది. యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.
11
సీయోను స్త్రీలారా, బయటకు రండి రాజు సొలొమోనును చూడండి అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున అతని తల్లి పెట్టిన కిరీటాన్ని చూడండి!
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 4 →
All chapters:
1
2
3
4
5
6
7
8