bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Telugu
/
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
/
Song of Solomon 8
Song of Solomon 8
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
1
నీవు నా తల్లి పాలు త్రాగిన నా సహోదరుడివైయుంటే, నీవు నాకు బయట అగుపిస్తే, నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని. అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు!
2
నేను నిన్ను నాకు అన్నీ నేర్పిన మా తల్లి ఇంటి గదిలోనికి తీసుకుపోయి ఉండేదాన్ని. దానిమ్మ పళ్లరసంతో చేసిన సురభిళ మధువును నీకు ఇచ్చి ఉండేదాన్ని.
3
అతను తన ఎడమ చేతిని నా తల క్రింద ఉంచి తన కుడిచేతితో నన్ను కౌగలించుకొంటాడు.
4
యెరూషలేము స్త్రీలారా మీరు నాకొక వాగ్దానం చేయండి నా ప్రేమ స్వయం ప్రేరితమయ్యేదాకా, ప్రేమను జాగృతం చేయకండి ప్రేమను పురిగొల్పకండి.
5
ఎడారి మార్గంలో, తన ప్రియుని ఆనుకొని వస్తున్న ఈ స్త్రీ ఎవరు? జల్దరు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను. అచ్చటే నిన్ను మోసిన నీ తల్లి నిన్ను కన్నది.
6
నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు, నీ వేలికి ముద్రికలా ధరించు. మృత్యువంత బలమైనది ప్రేమ పాతాళమంత కఠనమైంది ఈర్శ్య. అగ్ని జ్వాలల్లాంటివి దాని మంటలు అవి పెచ్చు మీరి మహాజ్వాల అవుతాయి.
7
ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదు. నదీ జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు. ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధారపోస్తే, అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు!
8
మాకు ఉన్నదొక చిన్న చెల్లెలు ఆమెకింకా యుక్త వయస్సు రాలేదు. ఆమెను వివాహం చేసుకొనుటకు ఒక పురుషుడు వస్తే, మా చెల్లెలి విషయంలో మేమేమి చెయ్యాలి?
9
అది ప్రాకారమైతే, దాని చుట్టూ వెండి నగిషీ చేస్తాము అది తలుపైతే, దాని చుట్టూ దేవదారు పలకలతో అంచులు అలంకరిస్తాము.
10
నేను ప్రాకారం వంటిదాన్ని నా వక్షోజాలు గోపుర ప్రాయాలు అతనికి నేనంటే తనివి, తృప్తి!
11
బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది. ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు. వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు ఇచ్చాడు.
12
సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీవే ఉంచుకో, వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకు అతడు తెచ్చిన ద్రాక్షాలకోసం యివ్వు. నా ద్రాక్షాతోట నా స్వంతంగా ఉంటుంది!
13
ద్రాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ, నీ చెలికత్తెలు నీ స్వరం వింటున్నారు, నీ మధుర స్వరాన్ని నన్నూ విననీయి.
14
నా ప్రాణ స్నేహితుడా, వేగిరం వచ్చెయ్యి. జింకల్లా, లేడి పిల్లల్లా పరిమళవృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.
← Chapter 7
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
All chapters:
1
2
3
4
5
6
7
8